Friday, November 22, 2024

రెజ్లింగ్‌కు వినేశ్ ఫొగాట్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

భారత దిగ్గజ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలో ఫ్రిస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్‌పై నిర్వాహకులు అనూహ్య వేటు వేసిన విషయం తెలిసిందే. 100 గ్రాముల బరువు పెరిగిందనే కారణంతో ఒలింపిక్ కమిటీ వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వినేశ్‌తో పాటు కోట్లాది మంది భారతీయుల గుండె పగిలింది. అనర్హత వేటు పడడంతో వినేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా వినేశ్ ట్విటర్‌లో భావోద్వేగా సందేశాన్ని పెట్టింది. తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించడంది. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇలాంటి స్థితిలో ఇకపై పోరాడే శక్తి కానీ, బలం కానీ నాకు లేదు. కష్టకాలంలో ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సదా రుణపడి ఉంటా అని వినేశ్ తన సందేశంలో పేర్కొంది.

పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ అసాధారణ ప్రతిభతో ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆమె 50 కిలోల విభాగంలో స్వర్ణం కోసం పోటీ పడాల్సి ఉంది. అయితే ఫైనల్స్‌కు కొద్ది గంటల ముందు బరువు అధికంగా ఉందనే కారణంతో నిర్వాహకులు వినేశ్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో స్వర్ణం గెలుస్తుందని భావించిన వినేశ్ అనూహ్యంగా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక చేతిదాకా వచ్చిన పతకం చేజారడంతో వినేశ్ పూర్తిగా నిరసించి పోయింది. చివరికి తాను ఎంతో ఇష్టపడే రెజ్లింగ్ నుంచి తప్పుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. వినేశ్ తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది అభిమానులు మనో వేదనకు గురయ్యారు. వినేశ్ తన నిర్ణయాన్ని మార్చుకుని రానున్న ఒలింపిక్స్‌కు సిద్ధం కావాలని వారు కోరుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News