Thursday, November 21, 2024

న్యాయవాద దంపతులపై దాడి

- Advertisement -
- Advertisement -

న్యాయవాద దంపతులపై జనగామ సిఐ, ఎస్‌ఐ, పోలీసులు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. న్యాయవాదుల నిరసనకు కారణమైంది. పోలీసులు, న్యాయవాదులకు మధ్య మరోసారి ఈ ఘటన రచ్చ రేపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో న్యాయవాదులు తమ నిరసనను బాహాటంగా వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంగా డిమాండ్ చేస్తూ వారు తమ నిరసనలను తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే జనగామ పోలీస్ స్టేషన్లో బాదితురాలు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్లి అడిగినందుకు న్యాయవాద దంపతులు గద్దల అమృత రావు, -కవితలపై పోలీసు సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే ఆకారణంగా న్యాయవాదులపై సిఐ రఘుపతి, ఎస్‌ఐ తిరుపతి,

పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. కాగా, ఈ సంఘటనపై పోలీస్ శాఖ విచారణ చేసి చర్యలు తీసుకొంది. అందుకు కారకులైన జనగామ ఇన్స్ స్పెక్టర్ ఎల్. రఘుపతి రెడ్డి, ఎస్‌ఐ పి. తిరుపతి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయగా, కానిస్టేబుల్ బి. కరుణాకర్‌ను ఏఆర్‌కు అటాచ్ చేయడంతో పాటు , సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డిని జనగామ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ గా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సిఐగా దామోదర్ రెడ్డిని నియమించారు. న్యాయం గెలిచిందని డిసిపి రాజమహేంద్ర నాయక్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ న్యాయవాద దంపతులతో పాటు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News