Monday, December 23, 2024

సెమీస్‌లో అమన్ పరాజయం

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ అమన్ సహ్రావత్ పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో అమన్ 010 తేడాతో హిగుచి (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. ఆరంభం నుంచే జపాన్ రెజ్లర్ హిగుచి దూకుడును ప్రదర్శించాడు. అద్భుత పట్టుతో అమన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. హిగుచి ధాటికి అమన్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు.

పూర్తి ఆధిపత్యం చెలాయించిన హిగుచి అలవోక విజయంతో ఫైనల్‌కు చేరి రజత పతకం ఖాయం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన అమన్ శుక్రవారం కాంస్య పతకం కోసం పోటీ పడుతాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో అమన్ 120 తేడాతో అబాకరోవ్ (అల్బేనియా)పై అలవోక విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో మూడు పాయింట్లు సాధించిన అమన్ తర్వాతి రౌండ్‌లో మరింత దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. అమన్ ధాటికి అబాకరోవ్ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News