Friday, December 20, 2024

నీట్ పిజి పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 11న జరగవలసి ఉన్న నీట్ పిజి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నీట్ పిజి పరీక్ష కోసం అభ్యర్థులకు కేటియించిన నగరాలు చాలా దూరంలో ఉండడం వల్ల చేరుకోవడానికి ఇబ్బంది ఉందంటూ పిటిషనర్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఐదుగురు అభ్యర్థుల కోసం రెండు లక్షల మంది అభ్యర్థుల జీవితాలను తాము సంక్షోభంలోకి నెట్టలేమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

అటువంటి పరీక్షను ఎలా వాయిదా వేయగలమని, ఇటీవలి కాలంలో పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ ప్రజలు సర్వసాధారణ విషయంలా సుప్రీంకోర్టుకు వచ్చేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ హెగ్డేను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. తాము పరీక్షను రద్దు చేస్తే రెండు లక్షల మంది విద్యార్థులు, నాలుగు లక్షల మంది వారి తల్లిదండ్రులు రోదిస్తారని, ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను తాము ఇబ్బందుల పాలుచేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిరటిషన్ల వెనుక ఉన్నదెవరో తమకు తెలియదని ధర్మాసనం పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News