Tuesday, December 3, 2024

ప్రేమ పేరుతో వేధింపులు..యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ప్రేమ పేరుతో ఆకతాయి వేధింపులు భరించలేక యువతి ఇంటి మూడో అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండల పరిధిలోని దోమడుగు గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. జిన్నారం సిఐ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… బిఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న తేజస్విని (21)ని ఒక యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు ఐదు నెలల క్రితం ఆ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఫోన్ ద్వారా తరచూ ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఆమెను వివాహం చేసుకోమని వేధింపులకు పాల్పడం ప్రారంభించడంతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా బెదిరింపులకు గురి చేసేవాడు. దీనితో  మనస్థాపం చెందిన యువతి ఇంటిపై మూడోవ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్యకు యత్నించింది.

కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, వేధింపులకు గురిచేసిన యువకుడిని ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. దాచారం గ్రామం డి ఆర్‌డిఓ సంస్థ అభివృద్ధి కోసం ఊరుని ఖాళీ చేసి పంపించడంతో బతుకు తెరువు కోసం మృతురాలి కుటుంబం దోమడుగు గ్రామానికి వలస వచ్చి బతుకు తెరువు సాగిస్తోంది. మృతురాలి తండ్రి రామారం రాజు కూలి పని చేస్తూ బతుకు సాగిస్తున్నాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె తేజస్విని బి ఫార్మసీ రెండవ సంవత్సరం చదువుతోంది. చదువుతోపాటు పలువురితో చలాకీగా చాలా చురుకుగా ఉండేదని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News