Wednesday, January 15, 2025

మా సినిమాకు కీరవాణి సంగీతం అందించడం మా అదృష్టం : వైవిఎస్ చౌదరి

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ‘న్యూ టాలెంట్ రోర్స్ @‘ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ శుక్రవారం మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ప్రకటించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో కథానాయికగా నటించబోయే హీరోయిన్ పేరుని కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ “ఈ కథని నేను రాసుకున్నాను. దీనికి అర్ధవంతమైన మాటలు రాయడానికి సమర్దవంతమైన మాటల రచయిత కావాలి. కంచె సినిమా చూసినప్పుడే సాయి మాధవ్ బుర్రాతో పని చేయాలని అనుకున్నాను. ఆయన అన్ని సినిమాలకు న్యాయం చేశారు. ప్రతి సినిమాకి గొప్పగా ఎదిగారు. ఇప్పుడు ఈ సినిమాకు ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణంగా భావిస్తుంటాను. కీరవాణి యుగపురుషుడు లాంటి వారు. ఒక సంగీత దర్శకుడికి ఎంత ప్రావీణ్యం ఉండాలో అంత ప్రావీణ్యం వున్న సంగీత దర్శకుడాయన.

ఆయనతో నా మొదటి సినిమాకి పని చేయడం నా అదృష్టం. ఆయన నాకు మర్చిపోలేని పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. అలాంటి మహానుభావుడితో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన కథ విని చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఒక పెద్దన్నయ్యలా సలహాలు సూచనలు ఇచ్చారు. సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. ఆయన సాహిత్యం మహా అద్భుతంగా వుండబోతోంది. గొప్ప రూప సౌందర్యం ఉన్న హీరోయిన్ వీణ రావు మన తెలుగమ్మాయి. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. అలాగే ఈ సినిమాతో కొత్త టాలెంట్‌ని కూడా ప్రోత్సహిస్తున్నాం”అని అన్నారు. డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ “న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ లో వైవిఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ లాంటి మహామహులతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత యలమంచిలి గీతకి ధన్యవాదాలు. కథ విన్నాను. చాలా మంచి కథ. బ్యానర్ లానే ప్రతిబించే ప్రతిభ గర్జిస్తే ఎలా వుంటుందో సినిమా కూడా అలానే వుంటుంది. మంచి డైలాగ్స్ రాసే అవకాశం వున్న కథ. ప్రాణం పెట్టి ఈ సినిమాకి పని చేస్తాను”అని తెలిపారు. ఈ సమావేశంలో యలమంచిలి గీత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News