- Advertisement -
హైదరాబాద్: రెండో అంతస్తు పైనుంచి దంపతులు కిందపడడంతో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడిన సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివకాల ప్రకారం… శనివారం ఉదయం పని నిమిత్తం భవనం వద్దకు గిరి- లక్ష్మమ్మ వచ్చారు. రెండో అంతస్తులో పని చేస్తుండగా దంపతులు కిందపడ్డారు. భర్త గిరి ఘటనా స్థలంలోనే చనిపోగా భార్య లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గోపాలపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కింద పడ్డారా? లేక ఎవరైనా వారిని కిందకు తోసేశారా?… ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -