Saturday, December 21, 2024

గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..80 మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

గాజా సిటీలో ఒక పాఠశాలపై శనివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 80 మందికి పైగా వ్యక్తులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తబీన్ పాఠశాలపై దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అంగీకరించింది. అయితే, పాఠశాల లోపల గల హమాస్ కమాండ్ సెంటర్‌పై తాము దాడి జరిపినట్లు మిలిటరీ తెలిపింది. కానీ హమాస్ దానిని ఖండించింది.

దాడిలో హతులైన 80 మంది మృతదేహాలు తమ ఆసుపత్రికి వచ్చినట్లు గాజా సిటీలో అల్ అహ్లి ఆసుపత్రి డైరెక్టర్ ఫాదెల్ నయీమ్ వెల్లడించారు. వైద్య బృందాలు 70 మృతదేహాలను గుర్తించాయని, కనీసం మరి 10 మంది శరీర భాగాలను బృందాలు అందుకున్నాయని ఆయన తెలిపారు. గాజాలోని దాదాపు చాలా సంస్థల మాదిరిగా ఆ పాఠశాలను యుద్ధం వల్ల తమ ఇళ్లను వదలి పారిపోవలసి వచ్చినవారు ఒక ఆశ్రయంగా ఉపయోగించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News