Saturday, December 21, 2024

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా టివి సోమనాథన్ నియామకం

- Advertisement -
- Advertisement -

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబ స్థానంలో సీనియర్ ఐఎఎస్ అదికారి టివి సోమనాథన్ శనివారం నియమితులయ్యారు. తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన సోమనాథన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, వ్యయ శాఖ కార్యదర్శిగా పినచేస్తున్నారు. క్యాబినెట్ కార్యదర్శిఆ సోమనాథన్ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఆయన ఈ పదవిలో ఆగస్టు 30 నుంచి రెండేళ్ల పాటు ఉంటారు. క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకనేంత వరకు క్యాబినెట్ సచివాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా సోమనాథన్ నియామకాన్ని నియామకాల కమిటీ ఆమోదించింది. ఐదేళ్ల క్రితం 2019 ఆగస్టు 30న క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబ బాధ్యతలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News