Monday, November 25, 2024

లంచంగా 5 కిలోల ఆలుగడ్డలు..ఎస్‌ఐ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

లంచంగా ఆలుగడ్డలను డిమాండ్ చేసినందుకు ఒక ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ లంచంగా కోరింది కేవలం ఆలుగడ్డలను కాదని, అది దేనికో సంకేత నామమని అనుమానిస్తున్న పోలీసులు దాని నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. సౌరిఖ్ పోలీసు స్టేషన్ పరిధిలోని భవల్‌పూర్ చపనున్న చౌకీలో ఎస్‌ఐగా పనిచేస్తున్న రాం కృపాల్ సింగ్ కేసును సెటిల్ చేసేందుకు ఒక రైతు నుంచి 5 కిలోల ఆలుగడ్డలు డిమాండ్ చేయడం ఆ ఆడియో క్లిప్‌లో వినిపించింది.

అయితే అంత ఇవ్వ లేనని రైతు బతిమాలాడు. దీంతో రైతుపై ఎస్‌ఐ మండిపడ్డాడు. మొత్తానికి 3 కిలోలకు వీరి మధ్య ఫోన్‌లో అంగీకారం కుదిరింది. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్‌ఐ కృపాల్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్‌పి అమిత్ కుమార్ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. ఆలుగడ్డలకు ఏదో కోడ్ భాష ఉందని, అదేమిటో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసును తేల్చే బాధ్యతను కన్నౌజ్ నగర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కమలేష్ కుమార్‌కు ఎస్‌పి అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News