హైదరాబాద్ మేయర్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన నిందితుడిని నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, ఇతర సామగ్రి స్వాధీనం. పోలీసుల కథనం ప్రకారం…ఉప్పల్, ఫిర్జాదీగూడకు చెందిన చాకూరి లక్ష్మణ్(29) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో పలు ఫొటోలు, వీడియోలు పొస్టు చేస్తుంటాడు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫొటొలు, వీడియోలు నిందితుడు తీసుకుని వాటిని మార్ఫింగ్ చేయడమే కాకుండా,
అసభ్యంగా పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌లో ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటిపై మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసిన దానిపై ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ మధులత, ఎస్సై ప్రణీత తదితరులు దర్యాప్తు చేశారు.