Friday, September 20, 2024

క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ముంబై: నెటిజన్లు ఎంతో నమ్మకంగా ఉపయోగించే బ్రౌజర్ క్రోమ్. కంటెంట్ ను క్షణాల్లో నెటిజన్ల ముందుంచుతుంది ఈ బ్రౌజర్. అయితే ఇప్పుడు హ్యాకర్ల కన్ను ఈ బ్రౌజర్ పై పడింది. దాంతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-in) డెస్క్ టాప్ సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని లోపాలు తలెత్తాయని, బగ్స్ ను ఆసరా చేసుకుని సిస్టమ్స్ హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది.  పాస్ వర్డ్ లను కూడా దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  కాగా విండోస్, మ్యాక్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్లను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News