Friday, November 22, 2024

సిరిసిల్లా నర్సయ్య కోసం విదేశాంగ మంత్రికి కెటిఅర్ లేఖ

- Advertisement -
- Advertisement -

బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మానువాడ నర్సయ్యకు అండగా ఉంటానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు నర్సయ్యను వెంటనే దేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జయశంకర్‌కు కెటిఅర్ లేఖ రాశారు. నర్సయ్యను భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని చెప్పారు. నర్సయ్యకు తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను ఇచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్‌కి రాసిన లేఖలో కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర విదేశాంగ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తి సహకారం అందించి నర్సయ్య పాస్‌పోర్ట్ జారీ అయ్యేలా చూడాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా ఈ మేరకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను విడుదల చేసి భారత్‌కు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను బహ్రెయిన్ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని,

నర్సయ్య గుర్తింపును ధృవీకరించాలని బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థ ‘లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ’ 2024 జనవరి 8న బహ్రయిన్‌లోని భారత రాయబారికి లేఖ రాసిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నర్సయ్యను వెంటనే స్వదేశానికి పంపించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నర్సయ్యకు భారత ప్రభుత్వం తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేసి తిరిగి భారత్‌కు పంపించే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా బహ్రెయిన్‌లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం, బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి నర్సయ్య చిరునామా కనుక్కొని సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పిల ద్వారా నివేదిక నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్‌పితో మాట్లాడి వీలైనంత నివేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను మరింత వేగంగా తీసుకెళ్లాలని తన కార్యాలయ సిబ్బందికి కెటిఆర్ ఆదేశించారు.

బహ్రెయిన్ జైల్లో పాస్‌పోర్ట్ సమస్యలతో చిక్కుకున్న నర్సయ్య
అనేక సంవత్సరాలుగా ఆచూకీ లేకుంటే పోయిన నర్సయ్య బహ్రెయిన్‌లోని జైల్లో పాస్‌పోర్ట్ సమస్యలతో చిక్కుకున్నారు. నర్సయ్య పాస్‌పోర్ట్ పొగొట్టుకున్నారని, వర్క్ పర్మిట్, పాస్‌పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని, దీంతో నర్సయ్య జైల్లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. నర్సయ్యను భారత్‌కు రప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారు. ఈ విషయం స్థానిక ఎంఎల్‌ఎ కెటిఆర్ దృష్టికి రావటంతో ఆయన స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News