కొడంగల్: కొండారెడ్డిపల్లిలో దాయాదుల వేధింపులు తట్టుకోలేక అనుముల గురవారెడ్డి దేవాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొండారెడ్డిపల్లిలో అనుముల కృష్ణా రెడ్డి, గురువారెడ్డి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. రూ. 6 లక్షల అప్పు, భూ వివాదంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో గురువారెడ్డిని ఫిబ్రవరి 21 పెద్దల మనుషుల సమక్షంలో గొడవ పెట్టారు. దేవాలయంలో గురువా రెడ్డిని బంధించగా అవమానం భరించలేక ఆ గుడిలోనే ఫిభ్రవరి 22న దోతితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకొని స్థానిక రాజకీయ నాయకులు మృతదేహాన్ని ఖననం చేసినట్టు సమాచారం. అతడు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసిన అనంతరం ఉరేసి చంపి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామంలో రాజకీయ నాయకుల వేధింపులతోనే గురువారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొండారెడ్డిపల్లిలో అనుముల గురువారెడ్డి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -