Monday, December 23, 2024

కంగ్రాట్స్ నిహారిక… ఆ సినిమా చూస్తా: మహేశ్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రెండో రోజుల క్రితం విడుదలై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నటి నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తుండగా యదువంశీ దర్శకత్వం వహించారు. 16 మంది నటీనటులతో గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను విభిన్న కథనంతో చిత్రీకరించారు. ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు నిహారికను అభినందించారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో విజయాన్ని అందుకోవడంతో పాటు సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినందుకు కంగ్రాట్స్ నిహారిక అని ట్వీట్ చేశారు. ఈ సినిమా గురించి మంచి విషయాలు ఇప్పటివరకు విన్నానని, అతి త్వరలో ఈ చిత్రాన్ని చూస్తానని చెప్పాడు. మహేశ్ బాబు ట్వీట్ వైరల్‌గా మారింది. చిన్న చిత్రాలను మహేష్ ప్రోత్సహిస్తున్నందుకు అటు సూపర్ స్టార్, ఇటు మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కమిటీ కుర్రళ్ళో విజయం సాధించడంతో నిహారిక మీడియాతో మాట్లాడారు. తాను తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక మంచి నిర్ణయమని, తన సోదరుడు, నటుడు అంకిత్ ఒక సారి ఫోన్ చేసి తన స్నేహితుడి వద్ద కథ ఉందని చెప్పినప్పుడు తాను వినలేదని, మూడు నెలలు కాలయాపన చేసిన తరువాత కథ విన్నానని, కథం వినిన తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదని నిహారిక వివరణ ఇచ్చారు. మా సినిమాను కొంత మంది సెకండాఫ్ బాగోలేదని కామెంట్లు చేయడంతో పాటు రివ్యూలు రాస్తున్నారని, వంద శాతం మందికి నచ్చేలా సినిమాలు చేయడం కుదరదని, 99 శాతం మందికి మా మూవీ నచ్చిందని, ఇప్పుడు ఇది పీపుల్స్ మూవీ అయిందని సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News