మస్తాన్ సాయి ఫోన్‌లో 800మంది యువతుల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతుల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మొబైల్‌లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతులను టార్గెట్‌గా చేసుకొని మస్తాన్ మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. ఫోన్‌లో పెద్ద ఎత్తున ఫొటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. దీంతో పాటు మస్తాన్ సాయి కాల్ డేటా, మెయిల్ ఐడీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు, రాజ్ తరుణ్,- లావణ్య కేసులో కీలక వ్యక్తి మస్తాన్ సాయి. ఈ రెండు కేసుల్లోనూ ఈ పేరు ప్రధానంగా వినిపించడంతో మస్తాన్‌సాయిని అరెస్ట్ చేస్తే కేసులు ఓ కొలిక్కి వస్తాయని భావించిన ఏపీ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్పెషల్ ఫోకస్ పెట్టింది. మస్తాన్ సాయి గుంటూరులోని మస్తానయ్య దర్గాలో తలదాచుకుని ఉన్న విషయం తెలియడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ దర్గాకు మస్తాన్‌సాయి తండ్రి రావి రామ్మెహన్ రావు నిర్వాహకుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. జూన్- 3వ తేదీన మస్తాన్ సాయి విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడులు చేశారు. అప్పట్లో పోలీసులు కళ్లుగప్పి పరారైన మస్తాన్ సాయి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.