Friday, December 20, 2024

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే టైటిల్ టీజర్ రిలీజ్!

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్‌బికె 109 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలోని ఓ కీలక సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ జైపూర్‌లో జరిగింది. తాజాగా ఈ షూటింగ్‌ను పూర్తి చేసినట్లుగా దర్శకుడు బాబీ తెలిపాడు.

త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ఆయన వెల్లడించాడు. దీంతో నందమూరి అభిమానులు ఈ టైటిల్ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News