కోల్‌కతా : ఆర్‌బి కార్ ఆసుపత్రి డాక్టర్ హత్య కేసును పోలీసులు ఆదివారం (18) నాటికి పరిష్కరించని పక్షంలో హత్య దర్యాప్తు బాధ్యతను సిబిఐకి తన ప్రభుత్వం అప్పగిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఒక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ కేసు ను విచారించాలని తాను కోరుకుంటున్నట్లు కూడా మమ త తెలియజేశారు. ‘పోలీసులు దీనిని ఆదివారం నాటికి పరిష్కరించలేకపోతే కేసును సిబిఐకి అప్పగిస్తాం. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థ విజయం రేటు చాలా తక్కువగా ఉంది’ అని మమత కోల్‌కతాలో దివంగత డాక్టర్ నివాసం సందర్శన అనంతరం విలేకరులతో చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఆ మహిళా డాక్టర్ హత్యాచారంపై సిబిఐ దర్యా ప్తు కోరుతున్న కనీసం మూడు పిల్‌లను కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించనున్నది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సిబిఐకి బదలాయించాలని కోరుతూ కనీసం మూడు పిల్‌లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ముందు దాఖలయ్యాయి. పిల్‌లను, దీనికి సంబంధించిన ఏవైనా ఇతర పిటిషన్లను మంగళవారం విచారణకు చేపడతామని బెంచ్ తెలియజేసింది. బెంచ్‌లో న్యాయమూర్తి హిరణ్మయ్ భట్టాచార్య కూడా ఉన్నారు. మహిళా డాక్టర్ మృతదేహం ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో శుక్రవారం కనిపించింది. హత్యకు ముందు ఆమెపై లైంగిక అత్యాచారం జరిగిందని ప్రాథమిక అటా ప్సీ నివేదిక సూచించింది. ఈ హత్య సందర్భంగా ఒక వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.
వారం రోజుల గడువు దేనికో?: జూడాల ప్రశ్న
ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీపై హత్యాచారం కేసు పరిష్కారానికి ఏడు రోజుల గడువును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు ఇచ్చారని కోల్‌కతాలో ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు సోమవారం ప్రశ్నించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కేసుపై పారదర్శక దర్యాప్తునకు మమత వాగ్దానం చేసినప్పటికీ దర్యాప్తులో జాప్యాన్ని నిరసనకారులు విమర్శించారు. న్యాయ విచారణ జరిపించాలని, దోషులకు మరణ శిక్ష విధించాలని, బాధితురాలి కుటుంబానికి సముచిత నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు. దర్యాప్తు గురించి వినవస్తున్న వదంతుల విషయమై కోల్‌కతా పోలీసులు క్షమాపణ చెప్పాలని,
ఆసుపత్రి సీనియర్ అధికారులను అందరినీ తొలగించాలని, వారి వేరే చోట బాధ్యతలు అప్పగించరాదని కూడా వారు కోరారు. పోలీసులు ఆదిలో దీని ని ఆత్మహత్యగా అనుమానించారు. కానీ ఆ తరువాత తమ వైఖరి మార్చుకున్నారు. ‘దర్యాప్తును ఆదివారం వరకు ఎం దుకు జాప్యం చేస్తున్నారు? దర్యాప్తు పట్ల మేము అసంతుష్టితో ఉన్నాం. మా డిమాండ్లు సుస్పష్టం. ఈ వ్యవహారంపై న్యాయ విచారణను, దోషులకు మరణ శిక్షను కోరుతున్నాం. డాక్టర్ కుటుంబానికి పరిహారం చెల్లించాలి. దర్యాప్తునకు సంబంధించిన వదంతులపై కోల్‌కతా పోలీసులు క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నాం’ అని ఆందోళనకారుడైన జూనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు.
కోల్‌కతాకు ఎన్‌సిడబ్లు బృందం
ఇది ఇలా ఉండగా, మహిళా డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) నుంచి ఇద్దరు సభ్యుల బృందం సోమవారం కోల్‌కతాచేరుకున్నది. డెలినా ఖోంగ్‌దుప్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బృందం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులతో మాట్లాడేందుకు వి మానాశ్రయం నుంచి నేరుగా లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీ స్‌శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. ‘ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. ఇటీవలి కాలంలో అత్యంత హీనమైన నేరాల్లో ఒకటి. ఇటువంటి ఘటనలు పశ్చిమ బెం గాల్‌లో జరుగుతున్నాయి. మేము పోలీస్ అధికారులను క లుసుకోనున్నాం,హతురాలి తల్లిదండ్రులను కూడా కలుసు కుంటాం. నేరం జరిగిన ఆసుపత్రికి ఆ తరువాత వెళతామ’ ని ఖోంగ్‌దుప్ విమానాశ్రయంలో విలేకరులతో చెప్పారు.
హత్యాచారం చేసి నిందితుడు హాయిగా నిద్రపోయాడు
కోల్‌కతా : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలే జీ, ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై నిందితుడు సివిక్ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడడమే కాకుండా హత్య చేసిన తరువాత తన నివాసానికి వచ్చి హాయిగా నిద్రపోయినట్టు పోలీస్‌ల దర్యాప్తులో తేలింది. ఆ తరువాత ఉదయం సాక్షాలను చెరిపివేయడానికి దుస్తులను ఉతుకుకున్నా డు. కానీ పోలీస్‌లు అతని బూట్లపై రక్తపు మరకలు ఆధారంగా నిందితుడిని గుర్తించ గలిగారు. నిందితుడు పౌర వాలంటీర్. ఆ స్పత్రితో తనకేమీ సంబంధం లేదు. కానీ ఆస్పత్రి పరిసరాలకు తరచుగా వస్తుంటాడు. ఆసుపత్రి సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగాక అర్థనగ్నంగా ఆమె మృతదేహం శుక్రవారం ఉద యం కనిపించింది. శనివారం నిందితుని అరెస్ట్ జరిగింది.
మొదట హత్య, తరువాత అత్యాచారం
ప్రాథమిక పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం బాధితురాలి శరీరంపై అనేక గా యాలు ఉన్నాయి. కళ్ల నుంచి, నోరు, మర్మాయవాల నుంచి నెత్తురు వస్తోం ది. ఎడమ కాలిపైన, మెడ, కుడిచేయి, ఉంగరం వేలిపైన, పెదవుల పైన గా యాలు కనిపించాయి. సాక్షాల ప్రకారం జూనియర్ డాక్టర్ హత్య తరువాత అత్యాచారం జరగినట్టు తెలుస్తోందని మరో పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు.
నిందితుడు సంజయ్‌రాయ్ దర్యాప్తు సమయంలో ఎలాంటి పశ్చాత్తాప పడలేదు సరికదా నిర్లక్షంగా “తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోండి” అని సమాధానమిచ్చినట్టు పోలీస్ లు చెప్పారు. అతడి ఫోన్ పూర్తిగా అశ్లీల వీడియోలు ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణలో సిసిటివీ కెమెరా దృశ్యాల బట్టి శుక్రవారం తెల్లవా రు జామున 4 గంటల ప్రాంతంలో నిందితుడు ఎమర్జెన్సీ రూమ్‌లోకి ప్రవేశించినట్టు స్పష్టమైం ది. కొన్ని గంటల తరువాత అదే భవనంలో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. 23 వరకు నిందితుడికి రిమాండ్ విధించారు.