Tuesday, November 26, 2024

విద్యాసంస్థల్లో మేటి మద్రాసు ఐఐటి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోనే అత్యున్నత ప్రమాణాల విద్యాసంస్థల జాబితాలో మద్రాసు ఐఐటి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సోమవారం ఈ టాప్ ర్యాంకుల వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలో టాప్ నెంబరు 1 స్థానంలో మద్రాసు ఐఐటి నిలవడం, ఇది ఈ క్రమంలో వరుసగా తొమ్మిదోసారి కావడం కీలక పరిణామం. కాగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి) వరసగా తొమ్మిదోసారి ఉత్తమ విద్యాసంస్థగా రాణించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా ప్రమాణాలను విశ్లేషించే నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2024 పరిధిలో ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. ర్యాంకుల గణన ప్రకటన ఇది తొమ్మిదో పర్యాయం అయింది. మొత్తం మీద సమర్థత క్రమం జాబితాలో బెంగళూరు ఐఐఎస్‌సి రెండవ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఐఐటి బొంబాయి, నాలుగో స్థానంలో ఐఐటి ఢిల్లీ తమ ప్రతిభను చాటుకున్నాయి. గత ఏడాది ఢిల్లీ ఐఐటి మూడోస్థానంలో నిలవగా ఈసారి ఒక్క స్థానం దిగజారింది. కాగా టాప్ టెన్ జాబితాలో ఎనిమిది ఐఐటిలు స్థానం సంపాదించుకున్నాయి.

వీటిలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య విజ్ఞాన పరిశోధనా సంస్థ కూడా ఉంది. ఢిల్లీ జెఎన్‌యూ కూడా టాప్ టెన్‌లో ఒక్కటి అయింది. యూనివర్శిటీల విషయానికి వస్తే ఐఐఎస్‌సి బెంగళూరు తరువాత జెఎన్‌యూ తరువాతి క్రమంలో జెఎన్‌యు, జామియా మిలియా ఇస్లామియాలు ర్యాంకులు నిలబెట్టుకు న్నాయి. ఐఐటిలలో తొమ్మిది వరకూ టాప్ టెన్ లి స్టులో నిలవడం ఇందులో మద్రాసు ఐఐటి నెంబర్ 1 కా వడం కీలకం. ఇక మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యాసంస్థల వి షయానికి వస్తే అహ్మదాబాద్ ఐఐఎం నెంబర్ 1 అ యింది. తరువాతి స్థానంలో ఐఐఎం బెంగళూరు, ఐఐ ఎం కోజికోడ్‌లు నిలిచాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల జాబితాలో కూడా బొంబాయి, ఢిల్లీ ఐఐటిలు మొదటి పది ర్యాంకుల స్థానంలో నిలిచాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది.

ఫార్మసీ కోర్సుల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం
ఫార్మసీ విద్య సంబంధిత విద్యాసంస్థల్లో జామిమా హమ్‌దర్ద్ అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ మెరిసింది. అయితే ఇంతకు ముందటి నెంబర్ 1 స్థానం పోగొట్టుకుంది. బిట్స్ పలానీ మూడో స్థానంలోకి వచ్చింది. కాలేజీల కేటగిరిలో ఢిల్లీ వర్శిటీకి చెందిన హిందూ కాలేజీ, మిరండా హైస్‌లు మొదటి రెండో స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానాన్ని స్టీఫెన్స్ కాలేజీ దక్కించుకుంది.

న్యాయశాస్త్రంలో హైదరాబాద్ నల్సార్ 3వ ర్యాంక్
కీలకమైన న్యాయశాస్త్రం సంబంధిత విభాగంలో హైదరాబాద్ శివార్లలోని నల్సార్ యూనివర్శిటీకి ఈసారి మూడో ర్యాంక్ వచ్చింది. మొదటి స్థానంలో బెంగళూరులోని నేషనల్ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ, రెండోస్థానంలో నేషనల్ యూనివర్శిటా ఢిల్లీలు నిలిచాయని మంత్రి వెలువరించిన ప్రకటనలో వెల్లడైంది. ఆర్కిటెక్చర్‌లో ఐఐటి రూర్కే నెంబర్ 1 అయింది. రెండో స్థానంలో ఐఐటి ఖరగ్‌పూర్ తరువాతి స్థానంలో ఎన్‌ఐటి కాలికట్ నిలిచాయి. మెడికల్ కాలేజీలలో ఎయిమ్స్, పిజిఐఎంఇ చండీగఢ్, సిఎంసి వెల్లూరులు వరుసగా ర్యాం కులు తెచ్చుకున్నాయి. డెంటల్ కాలేజీల్లో సవితా ఇనిన్టూ ట్ ఆఫ్ మెడికల్ టెక్నికల్ సైన్సెస్ చెన్నై టాప్‌గా ఉంది. అగ్రికల్చర్ విద్యావిషయానికి వస్తే ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసర్చ్ ఇనిస్టూట్ టాప్ అయింది.

ఓపెన్ యూనివర్శిటీల్లో ఇగ్నో ఖ్యాతి
ఈసారి విద్యాఖ్యాతి విషయంలో సార్వత్రిక విద్య విషయంలో ఇగ్నోకు తొలిస్థానం దక్కింది. తరువాతి స్థానంలో కొల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ వర్శిటీ తరువాతి ర్యాంక్‌లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అహ్మదాబాద్‌లు నిలిచాయి. స్కిల్ వర్శిటీల జాబితాలో పుణేలోని సంబంధిత వర్శిటికి అగ్రస్థానం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News