Saturday, November 23, 2024

బంగ్లాతో సిరీస్‌కూ బుమ్రా దూరం?

- Advertisement -
- Advertisement -

ముంబై : టి20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఆడిన జప్స్రిత్ బుమ్రా ఆతరువాత జరగిన శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 40 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సయితం దూరకానున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే బుమ్రాకు మాత్రం వర్క్‌లోడ్ మెనేజ్‌మెంట్ కోటాలో విశ్రాంతిని ఇచ్చినట్టు తెలుస్తోంది. వరల్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం భారత్‌కు చాలా కీలకం. గాయంతో భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీతో ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతను మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే ఓ జాతీయ చానెల్ వివరాల ప్రకారం ఈ సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనే విషయంపై సెలెక్టర్లు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఆస్ట్రేలియా గడ్డపైనే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఆడనుంది. నవంబర్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అనంతరం సొంతగడ్డపైనే న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఉన్న కీలక టెస్ట్ సిరీస్ల నేపథ్యంలోనే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరాలంటే ఈ రెండు సిరీస్‌లో భారత్ విజయం సాధించడం చాలా కీలకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News