ఛండీగఢ్: ప్రేమజంట పారిపోవడంతో యువకుడి సోదరిపై యువతి కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన పంజాబ్ రాష్ట్రం లూధియానా ప్రాంతం తింబ రోడ్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెంది రవీందర్ సింగ్ తన కుటంబ సభ్యులతో కలిసి పంజాబ్‌లో నివసిస్తున్నాడు. రవీందర్ సింగ్ కూతురు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఏప్రిల్‌లో ప్రేమజంట ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయారు. దీంతో రవీందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమజంట కోసం వెతికారు.
ఎక్కడ కనిపించకపోవడంతో తన కూతురును తీసుకెళ్లిన యువకుడి ఇంటికి మే1న వెళ్లారు. అక్కడి ప్రేమ జంట కనిపించకపోవడంతో యువకుడి కుటుంబ సభ్యులు అడిగారు. వారు చెప్పకపోవడంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. యువకుడి సోదరిమణిపై రవీందర్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక అత్యాచారం చేయడంతో పాటు వీడియో రికార్డు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా బాధిత కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులు రవీందర్ సింగ్, సోదరుడు వరీందర్ సింగ్, అమన్ సింగ్, అనుచరుడు సంతోష్ సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.