- Advertisement -
జగిత్యాల: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ‘ జర్నలిస్టులకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అనుడే తప్ప…చేసిందేమీ లేదు.’ తాజాగా జగిత్యాల జర్నలిస్టులు ఇండ్ల స్థలాల సాధన కోసం విన్నూత్న పంథాను అనుసరించారు. వారు నిరసన చేపట్టి 11 రోజులవుతున్నాయి. అందులో భాగంగానే మంగళవారం వారు ప్లకార్డులతో అర్ధనగ్న ప్రదర్శనను జగిత్యాల పాత బస్టాండ్ లో నిర్వహించారు. ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో అనేక మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా తమకు దక్కాల్సిన హక్కుల కోసమే తాము పోరాడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు నిరసన దీక్ష కొనసాగుతుందన్నారు. అవసరమైతే నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
- Advertisement -