Sunday, November 24, 2024

122 మంది ఉద్యోగులు రిలీవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జా రీ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొం ది. తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభు త్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని వెల్లడించింది. ప్రస్తు తం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉ ద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల విభజన పూర్తయి పదేళ్లు గడుస్తున్నా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడుకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ స్థా నికత ఉన్న ఉద్యోగులు అభ్యర్థనలు పంపారు.అయితే ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలో మొత్తం 712 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉ ద్యోగులు ఉన్నారని సమాచారం. సచివాలయంతో పాటు వివిధ హెచ్‌ఒడిల కార్యాలయాలు, 9 10 షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తు న్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులు తమను రిలీవ్ చేయాలని కోరారు. ఈ క్రమంలోని తాజాగా సీఎం చంద్రబాబు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని నిర్ణయించే వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News