ముంబై: ఒలింపిక్స్‌లో పతకం సాధించే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్న యువ షట్లర్ లక్షసేన్‌పై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. లక్షసేన్ కాస్త ఏకాగ్రతతో ఆడివుంటే భారత్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో రజతం ఖాయంగా లభించేదన్నాడు. కీలకమైన పోరులో లక్షసేన్‌లో అంకితభావం కొరవడం బాధించే అంశమన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గాయాలను లెక్కచేయకూడదని, సర్వం ఒడ్డి పోరాడాల్సి ఉంటుందన్నాడు.
కానీ లక్షసేన్ కోర్టులో కదిలిన తీరు ఏమాత్రం బాగలేదన్నాడు. అతను కావాలనే మ్యాచ్‌ను చేజార్చుకున్నాడనే విషయం స్పష్టంగా కనిపించిందన్నాడు. చైనా, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కొరియా తదితర దేశాలకు చెందిన క్రీడాకారులు అసాధారణ ఆటతో ఒలింపిక్స్‌లో పతకాల పంట పండిస్తున్నారని, భారత్‌లో మాత్రం అలాంటి ఆటగాళ్లు ఎవరూ కనిపించడం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.