Monday, December 23, 2024

వినేశ్ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వేసిన పిటిషన్‌పై కాస్ తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇలా కోర్టు తీర్పును వాయిగా వేయడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో వినేశ్ మహిళల 50 కిలోల ఫ్రిస్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. అయితే వంద గ్రాముల బరువును అధికంగా కలిగివుందనే సాకుతో ఒలింపిక్ నిర్వాహకులు వినేశ్‌పై అనర్హత వేటు వేశారు.

తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)ను ఆశ్రయించింది. దీనిపై మంగళవారం కాస్ తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇరు వర్గాల వాదనలు విన్న కాస్..తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తే వినేశ్‌కు రజతం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కోట్లాది మంది భారతీయులు తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News