Thursday, December 19, 2024

బుధవారం రాశి ఫలాలు(14-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –  ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి కాలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనకన్నా పెద్దవారు అనుభవం ఉన్నవారితో చర్చలు జరిపి ఆ తర్వాత గాని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని గ్రహిస్తారు.

వృషభం – వృత్తిలో పురోగతి లభిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగ మించి ముందుకు వెళ్లగలుగుతారు. తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కోరుకుంటారు.

మిథునం – ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒక్కోసారి అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. సంతాన ఎదుగుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.

కర్కాటకం – పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘమైన ఆలోచనలు చేసి వాళ్లను సరైన మార్గంలో పెట్టాలని అహర్నిశలు శ్రమిస్తారు. కానీ ఎదుటి వ్యక్తుల నుంచి స్పందన కరువవుతుంది.

సింహం – ఉద్యోగంలో చికాకులు. పై అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. ఏదైనా సరే తట్టుకొని నిలబడాల్సింది మనమే, కుటుంబాన్ని నడిపించాల్సింది మనమే అనే ఆలోచన తో ముందుకు సాగుతారు.

కన్య –  ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి శుభవార్తను వినే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొంత ధనం మీ చేతికి అందుతుంది.

తుల – వివాహం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి మంచి సంబంధాలు కుదిరే విధంగా ఉంటుంది. వచ్చిన సంబంధం గురించి ఆరా తీసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

వృశ్చికం – నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నా వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చును. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం.

ధనుస్సు – ఆర్థిక. విద్య సంబంధమైన విషయాలు. వ్యాపార విషయాలు మధ్యస్థంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగి చికాకు కలిగించిన చివరకు పనులు పూర్తీ అవుతాయి.

మకరం – కొంతమంది సన్నిహితులతో కలిసి వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు. లాభాలలో మీకు వాటా ఇవ్వాల్సి వస్తుందని స్నేహితులు నమ్మకద్రోహం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి.

కుంభం – వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని భావించిన అది కుదరని పని అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూములకు సంబంధించిన విషయాలు కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.

మీనం – స్త్రీలతో విభేదాలు ప్రధాన ప్రస్తావనగా ఉంటాయి. శత్రువర్గం చెప్పుకోదగిన స్థాయిలో చికాకు పెంచుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తల అవసరం.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News