Thursday, December 19, 2024

సంధ్యారాజుకు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే ‘ఎట్ హోమ్ రిసెప్షన్’ సెలబ్రేషన్స్‌కి ఆహ్వానిస్తూ లేఖ అందింది. తన తొలి చిత్రం ‘నాట్యం’తో రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకున్న ఘనత సంధ్యారాజుకు సొంతం.

తమిళనాడుకి చెందిన వ్యాపారవేత్త, రామ్‌కో గ్రూప్ ఆఫ్ ఇండిస్టీస్ ఛైర్మన్ పి.ఆర్.వెంకట్రామరాజా పుత్రిక సంధ్యారాజు. హైదరాబాద్‌లో నిశృంఖల డ్యాన్స్ అకాడమీ, నిశృంఖల ఫిల్మ్ ఫౌండర్‌గా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తన నృత్య కళతో ప్రపంచ యవనికపై అసమానమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు సంధ్యారాజు. ఇక ‘ఎట్ హోమ్ రిసెప్షన్’ని ఈనెల 15న సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News