Wednesday, January 15, 2025

సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లాలనుకునే పర్యాటకులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. మరోవారం రోజుల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామాకు (గోవా) నేరుగా కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ఈ ట్రైన్ వారానికి రెండుసార్లు మాత్రమే ప్రయాణించనుంది. వీటి టిక్కెట్ ధరలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే తెలుగువారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురందించింది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలు సర్వీసును వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీసు,

కాచిగూడ నుంచి నాలుగు బోగీల(జనరల్, ఏసీ, స్లీపర్ కోచ్) సర్వీసు గుంతకల్ వద్ద గోవా రైలుతో అనుసంధానమై వెళ్లేవి.సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్చిలో లేఖ రాశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News