Monday, December 23, 2024

హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

నగరంలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు
అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి దాదాపు కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. నిందితుల నుంచి రూ. 1.10 కోట్ల విలువైన 256 గ్రాముల డ్రగ్స్‌తో పాటు ఒక కారు, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులలో ఓ నైజీరియన్, డ్రగ్ డెలివరీ బాయ్, మరో నిందితుడు కూడా ఉన్నారు. ఈ డ్రగ్స్‌ముఠాను బంజారాహిల్స్ పోలీసులు, హెచ్ న్యూ పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌తో పట్టుకున్నారు. వీరు గత కొంత కాలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే దానిపై విచారణ చేపడతామని పోలీసులు వెల్లడిం చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News