మన తెలంగాణ/హైదరాబాద్ : పంద్రాగస్ట్ ది నో త్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శా ఖ, పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫె న్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను బు ధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1037 మందికి ఈ పతకాలను ప్రదానం చేయ నున్నారు. ఇక, ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం ఒకరికి మాత్రమే వరించింది. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. మాదాపూర్ సిసిఎస్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్‌ను ప్రకటించారు. రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ యాద య్యకు రావడంపై రాష్ట్ర డిజిపి డా.జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. యాదయ్యను తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. జూలై 25, 2022న చైన్ స్నాచింగ్‌లు, ఆయుధాల వ్యాపారంలో ప్రమేయం ఉన్న కరుడుగట్టిన నేరస్థులు ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ పాల్గొన్న ప్రమాదకరమైన దోపిడీ సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు.
2022 జూలై 25 సాయంత్రం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో 72 ఏళ్ల మహిళ కె. కాత్యాయని తన నివాసానికి వెళ్తున్నప్పుడు బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె బంగారు గొలుసు లాగారు. ధైర్యంగా ఆమె గొలుసులో కొంత భాగం పట్టుకున్నప్పటికీ గాయపడ్డారు. దొంగలు ఎక్కువ భాగం గొలుసును దొంగిలించి పరారయ్యారు. పిటిషన్‌ను స్వీకరించిన వెంటనే హెడ్ కానిస్టేబుల్ యదయ్య, కానిస్టేబుళ్లు ఎం. రవి, ఏ.ధేబాష్ సహకారంతో నిందితులను అరెస్టు చేయడానికి ఒక ఆపరేషన్‌ను నిర్వహించారు. సిసిటివి ఫుటేజ్‌తో సహా సాక్ష్యాలను జాగ్రత్తగా సేకరించారు. దీని ద్వారా నిందితులను గుర్తించారు. మరుసటి రోజు 2022 జూలై 26న కానిస్టేబుల్ ఎం. కృష్ణ బోల్లారం ఎక్స్ రోడ్డు వద్ద నిందితులను గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య తన బృందంతో నిందితులను అరెస్టు చేయడానికి వెనువెంటనే వెళ్లారు. అరెస్టును ప్రతిఘటించిన నిందితులు హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఛాతి, వీపు, చేయి, కడుపు, పలు చోట్ల అనేకసార్లు పొడవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
అయినప్పటికీ యాదయ్య అద్భుత ధైర్యాన్ని ప్రదర్శించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. తీవ్ర గాయాల కారణంగా హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 17 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. పట్టుబడిన నిందితులు ఇషాన్ నిరంజన్ నీలంనల్లి (21), రాహుల్ (19)లు అనేక నేరాలకు పాల్పడినట్లు తేలింది. కర్ణాటక రాష్ట్రం లోని గుల్బర్గా జిల్లా లో, అశోకనగర్ పోలీస్ స్టేషన్‌ను భయభ్రాంతులకు గురిచేసి ప్రజల నుండి విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. ఒక వాచ్‌మన్‌ను ఇనుప రాడ్డుతో బెదిరించారు. పోలీస్ బృందం యొక్క సంకల్పం, ధైర్య సాహసాలతో బంగారు ఆభరణా లు, ఆయుధాలు, మొబైల్ ఫోన్లు సహా దొంగలించిన బడిన వస్తువులను రికవరీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య చర్యలను డిజిపి ప్రశంసిం చారు. ఆయన అచంచలమైన స్ఫూర్తి, విధి నిర్వహణకు కట్టుబడి ఉండటం అద్భుతమైనదిగా అభివర్ణిం చారు. ఆయన ధైర్యవంతమైన చర్యల ఫలితంగా చైన్ స్నాచింగ్, ఆయుధాల వ్యాపారం చేసే ఇద్దరు దుండగులను బంధించే క్రమంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గానూ ఈ ఏడాది అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకాన్ని ప్రకటించారు.డిజిపితో పాటు అదనపు డిజిపిలు సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్,
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. రమేష్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతను సత్కరించారు.
ఈ ఏడాది మొత్తం 1037 మందికి ఈ పతకాలు ప్రదానం చేయనున్నారు. ఇందులో 208 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, 75 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 624 మందికి పోలీసు విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను అందజేయనున్నారు. ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 21 మందికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మందికి ఈ పతకాలు వరించనున్నాయి. ఇందులో రాష్ట్రంలో ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం, ఏడుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 11 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు. ఇక, ఆంధ్రా నుంచి నలుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 19 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు అందజేయనున్నారు.
తెలంగాణ పోలీసులకు పతకాల పంట
తెలంగాణ పోలీసులకు 21 మెడల్స్ లభించాయి. అందులో ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు చడువు యాదయ్య (హెడ్ కానిస్టేబుల్), విశిష్ట సేవకు ప్రెసిడెంట్ మెడల్ – సంజయ్ కుమార్ జైన్ (అదనపు డిజిపి), కటకం మురళీధర్ (డిసిపి) ఎంపికయ్యారు. అదేవిధంగా మెరిటోరి యస్ సర్వీస్ మెడల్స్- అవినాష్ మొహంతి (సైబరాబాద్ పోలీసు కమిషనర్), కమాండంట్ జమీల్ బాషా, అదనపు ఎస్‌పి పి.కృష్ణమూర్తి , ఎస్‌ఐ లు కే.రాము, అబ్దుల్ రఫీక్, ఇక్రమ్ అబ్‌ఖాన్, శ్రీనివాస్ మిశ్రా, కే.బాలకృష్ణయ్య, ఏ.లక్ష్మయ్య, జి.వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ నూతలపాటి జ్ఞాన సుందరి ఉన్నారు. మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డుకు ఎస్‌పి సునీల్ దత్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మోర కుమార్, రిజర్వ్ ఎస్‌ఐ శనిగరపు సంతోష్ , జూనియర్ కమాండోలు ఏ.సురేష్, వి.వంశీ, కంపాటి ఉపేందర్, పాయం రమేష్‌లు ఎంపికయ్యారు.