- Advertisement -
తిరుపతి: సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల పైకి చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాలినడక మార్గంలో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు కనిపించడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాలినడకన వెళ్తున్నప్పుడు మహేశ్ కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. మహేశ్ బాబు ప్యామిలితో కలిసి కాలినడకన తిరుపతికి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు.
- Advertisement -