Saturday, December 21, 2024

కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతి నగర్ లోని ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలును హైడ్రా అధికారులు కూల్చివేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువును బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 24 గంటల ముగియకముందే భారీ ఎత్తున కూల్చివేతలు ప్రారంభించారు. చెరువులో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణాలును కూల్చివేస్తామని హెడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై హైదరాబాద సిటీజన్లు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News