Monday, December 23, 2024

ఎంపాక్స్ గ్లోబల్ ఎమర్జెన్సీని

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంపాక్స్ వైరస్ భయం పట్టుకుంది. కాంగోలో తలెత్తిన ఈ వైరస్ పొరుగుదేశాలకు కూడా విస్తరించడంతో పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ ) సమీక్షించింది. వెంటనే దీనిపై ప్రపంచ స్థాయిలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఈ వైరస్‌పై ఎమర్జెన్సీని ప్రకటించడం ఇది రెండేళ్లలో రెండోసారి. ఒక్క కాంగోలోనే కాకుండా 12 ఇతర దేశాల్లోనూ ఈ వైరస్ పెద్దలు చిన్నలలో వ్యాపించడం, ప్రాణాంతకం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇంతకు ముందటి కరోనా వైరస్ , దీనితో తలెత్తిన ఉత్పాతం క్రమంలో ఎటువంటి అజాగ్రత్తకు తావివ్వకుండా చేసేందుకు దీనిపై ప్రపంచ వ్యాప్త అలర్ట్ దిశలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దీనితో పలు దేశాలలో ప్రత్యేకించి అంతర్జాతీయ ప్రయాణాల క్రమంలో , పర్యాటకుల సందర్శనల విషయంలో పలు నిబంధనలు అమలులోకి వచ్చేందుకు వీలుంటుంది. వైద్యపరిభాషలో ఎంపాక్స్‌గా వ్యవహరించే ఈ వైరస్ సంబంధిత జబ్బులను ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ ,

నిరోధక కేంద్రాలు (ఆఫ్రికా సిడిసిలు) గుర్తించాయి. ఆఫ్రికాలో ఈ వైరస్‌తో 500 మంది వరకూ చనిపోయినట్లు అధికారికంగా గుర్తించారు. దీనితో ఈ వైరస్ నివారణకు ఐరాస వెంటనే స్పందించింది. డబ్లుహెచ్‌ఒ అత్యవసర కమిటీ సమావేశం జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచాలకులు టెడ్రోస్ అధ్నామ్ గెబ్రెయెసస్‌ను కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ వైరస్ వల్ల తలెత్తే ప్రజారోగ్య ప్రభావిత విషయాలను పరిశీలించాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై పరిశోధన, నియంత్రణకు అవసరం అయిన నిధులు, ప్రజా ఆరోగ్య సంరక్షణ చర్యల సంబందిత ఫియిక్ హెచ్చరికలు వెలువరించాలా? ఇతరత్రా చర్యలు తీసుకోవాలా? అనే విషయంపై ఆయనతో చర్చించారు. ఈ దశలోనే ఇప్పుడు దీనిపై గ్లోబల్ ఆరోగ్య చర్యలు అవసరం అని వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News