- Advertisement -
శనివారం దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో సాధారణ వైద్య చికిత్సలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతాలో లేడిడాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా భారత వైద్య సంస్థ (ఐఎంఎ) తమ నిరసన కార్యక్రమం ప్రకటిచింది. ఇందులో భాగంగానే శుక్రవారం 24 గంలల పాటు అత్యవసరేతర వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఎ ప్రకటించింది.
కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కార్ ఆసుపత్రిలో ఇటీవలే డ్యూటీలో ఉన్న సమయంలోనే ఓ ట్రైనీ లేడీడాక్టర్‌పై అత్యాచారం , హత్య ఘటన జరిగింది. దేశవ్యాప్త సంచలనం కల్గించిన ఈ ఘటన తరువాత బుధవారం రాత్రి ఆసుపత్రిపై దుండగులు విధ్వంసం జరిపారు. ఇప్పటికీ ఈ ఘటనపై తగు స్పందన లేదని, పైగా తమకు సరైన భద్రత లేకుండా పోయిందని పేర్కొంటూ వైద్యుల సంఘం ఉద్యమ కార్యాచరణకు ప్రకటన వెలువరించింది.
- Advertisement -