Thursday, September 19, 2024

హైదరాబాద్ లో ఎండిఎంఏ డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 29.6 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ జాయిట్ సిపి ఖరేషీ శుక్రవారం ఎక్సైజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన పివి రాహుల్, మహేష్ ఇద్దరు బెంగళూరులో డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి నగరంలోని కూకట్‌పల్లికి చెందిన వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

వీరు డ్రగ్స్‌ను బెంగళూరులో నితిన్ రెడ్డి, నైజీరియాకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఎస్టిఎఫ్ డిఎస్పి తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని టిం పట్టుకున్నారు. ఆగస్టు 31 వరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో నాటు సారాను లేకుండా చేయడంతోపాటు హైదరాబాద్‌లోని ఆపరేషన్ ధూల్‌పేట్ పేరుతో గంజాయి అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్నామని జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎప్సీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ ప్రదీప్ రావు, సీఐ వెంకటేశ్వర్లు పాల్గన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News