Thursday, September 19, 2024

వంద శాతం రుణమాఫీ నిరూపిస్తే అక్కడే రాజీనామా!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో రైతు రుణమాఫీ 40 శాతం మాత్రమే చేశారని బిఆర్‌ఎస్ క్యార్యనిర్వాహక అ ధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కెటిఆర్, ఇతర సీనియర్ పార్టీ నేతలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రుణమాఫీలో సవాలక్ష కొ ర్రీలు, ఆంక్షలు పెట్టారని, రైతు రుణమా ఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆ యన ధ్వజ మెత్తారు. రైతు రుణమాఫీ పైన తాను సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సిఎం రేవంత్‌రెడ్డి చేసిన రుణమాఫీ నిజమైతే, కొడంగల్ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దామన్నారు. ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జ రిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కెటిఆర్ సవాల్ విసిరారు. సిఎంకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్న ట్లు వెల్లడించారు. రుణమాఫీలో డిసెంబ రు 9 నుంచి ఆగస్టు 15 వరకు జాప్యం చేశారని పేర్కొన్నారు. బ్యాంకు లకు 9 నెలల వడ్డీ ఎవరు కడతారు? అని ప్ర శ్నించారు. 22.37 లక్షల మంది రైతులకు రూ.17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని వెల్లడించారు. తాము ఉ న్నప్పుడు రుణమాఫీ చేశామని, రైతుబం ధు వేశామన్నారు.

వర్షాకాలం రైతుభరోసా రూ.14 వేల కోట్లు ఇంకా ఇవ్వలేదని, మొన్న యాసంగీలో రూ.4 వేల కోట్ల రైతు ఎగ్గొట్టారని మండిపడ్డారు. వైరాలో రేవంత్‌రెడ్డి ప్రసంగం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. రుణమాఫీ సగం కూడా చేయకుండా సంపూర్ణంగా చేశామనడం మోసమని ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ, అధికారులు లేకుండా గ్రామాలకు వెళ్తే రైతులే కొడతారని ఆయన వ్యాఖ్యనించారు. హరీశ్‌రావు రాజీనామా చేయాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వందశాతం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని హరీశ్‌రావు అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు, విధానం లేదని ఆరోపించారు. రైతు రుణమాఫీపై బిఆర్‌ఎస్ పార్టీ హెల్ప్‌లైన్ పెట్టిందన్నారు. ఇప్పటివరకు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, నేటి నుంచి రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వ మోసాన్ని ఎండగడతా మన్నారు.సెప్టెంబర్ నెలలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తామన్నారు. మాకు ఇదే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News