Thursday, November 28, 2024

మను బాకర్ ఆటవిడుపు

- Advertisement -
- Advertisement -

షూటింగ్‌కు విరామం, గుర్రపు స్వారీకి సిద్ధం
పిటిఐ ఇంటర్వూలో స్టార్ షూటర్ ఆసక్తికర విషయాలు

న్యూఢిల్లీ: భారత షూటింగ్ సంచలనం, ఒలింపిక్ డబుల్ మెడల్ విన్నర్ మను బాకర్ కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. పారిస్ ఒలింపిక్స్ కోసం ఎడతెరిపి లేకుండా శ్రమించిన బాకర్ కొంత కాలం పాటు విరామం తీసుకోవాలని భావిస్తోంది. కోచ్ జస్పాల్ రానాతో కలిసి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో బాకర్ పలు విషయాలను వెల్లడించింది. ఒలింపిక్ పతకం సాధించాలనే లక్షంతో పిస్టల్ చప్పుళ్లతో తీరిక లేకుండా గడిపానని, దీంతో కొన్ని నెలలు షూటింగ్‌కు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.

మూడు నెలల పాటు విరామం తీసుకుని, గుర్రపు స్వారీ, స్కేటింగ్, భరతనాట్యం తదితర అంశాలపై దృష్టి పెడుతున్నట్టు వెల్లడించింది. మను బాకర్ పిటిఐ భేటీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఎప్పుడూ షూటింగ్‌తో తీరిక లేకుండా ఉండే తనకు ఇప్పుడు కొంత సమయం లభించింది. చిన్నతనంలో కరాటేలో శిక్షణ పొందానని, అయితే షూటింగ్ వల్ల దీనికి తగినంత సమయం కేటాయించలేక పోయానని పేర్కొంది. ఇప్పుడు నా వ్యక్తిగత ఇష్టాల కోసం సమయం వెచ్చించాలని భావిస్తున్నా. నాకు చాలా అభిరుచులున్నాయి. వాటిని నెరవేర్చుకుని సమయం అసన్నమైంది. గుర్రపు స్వారీ, స్కేటింగ్ అంటే తనకుఎంతో ఇష్టం. డ్యాన్స్ కూడా చాలా ఇష్టమే. భరతనాట్యం నేర్చుకుంటున్నా.

ఒలింపిక్స్ నేపథ్‌యలో భరతనాట్యం క్లాసులకు హాజరుకావడం కుదరలేదు. ఇప్పుడు దీని కోసం సమయం కేటాయిస్తా. వయోలిన్‌లో కూడా తనకు ప్రావీణ్యం ఉన్నట్టు మను బాకర్ వెల్లడించింది. గుర్రాపు స్వారీ అంటే తనకు చాలా ఇష్టమని దాని కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు వివరించింది. దీంతో పాటు స్కైడైవింగ్, స్కూబా డైవింగ్ కూడా చేయలాని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ జాబితాను విన్న కోచ్ రానా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. గుర్రపు స్వారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చే ప్రసక్తేలేదని రానా స్పష్టం చేశాడు.

స్కేటింగ్, గుర్రపు స్వారీ వంటి క్రీడలు చాలా ప్రమాదం కూడుకున్నవని ఈ క్రమంలో గాయాలకు గురయ్యే ప్రమాదం ఉందని రానా అభిప్రాయపడ్డాడు. అయితే మను బాకర్ మాత్రం తాను ఇప్పటికే ఈ క్రీడల్లో శిక్షణ తీసుకున్నానని, ఏదైన గాయం జరిగితే తనదే పూర్తి బాధ్యత అని సరదాగా చెప్పింది. ఇక పారిస్ ఒలింపిక్స్ తన కెరీర్‌లోనే చాలా కీలకమని వివరించింది. విశ్వక్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉండేదని, అయితే తన ఆట పూర్తిగా సంతృప్తి ఇచ్చిందని మను బాకర్ వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News