చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ నెల 15న థియేటర్స్‌లోకి వచ్చి అన్ని చోట్ల నుంచీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ‘తంగలాన్‘ సినిమాకు వస్తున్న భారీ స్పందన పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని ‘తంగలాన్’ నిలబెట్టిందని ఆయన అన్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ..- “తంగలాన్‘ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.
మేము ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఊహించలేదు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్‌తో మేము ఆశ్చర్యపోతున్నాం. చియాన్ విక్రమ్ కెరీర్‌లో ఇవే హయ్యెస్ట్ ఓపెనింగ్స్. 200 కోట్ల రూపాయల వరకు సినిమా రాబడుతుందని ఆశిస్తున్నాం. అందుకే టీమ్ థియేట్రికల్ విజిట్‌కు వెళ్తున్నారు. ఆడియెన్‌కు ‘తంగలాన్’ను మరింత చేరువచేయాలని ప్రయత్నిస్తున్నాం. విక్రమ్ కూడా తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ కూడా వెళ్లారు. తంగలాన్ కు థియేటర్స్ పెరుగుతున్నాయి.
అన్ని ఏరియాల్లో స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు. ఇక హిందీలో మూడు బిగ్ ఫిలమ్స్ రిలీజ్ అయ్యాయి. అందుకే బాలీవుడ్‌లో 30న రిలీజ్ చేస్తున్నాం. మిగతా అన్ని భాషల్లోనూ 30న తంగలాన్ రిలీజ్‌కు రాబోతోంది. తంగలాన్‌లో చియాన్ విక్రమ్‌తో పాటు పార్వతీ, మాళవిక, పశుపతి.. ఇంకా ప్రతి ఒక్కరి పాత్రల నటనకు ప్రశంసలు వస్తున్నాయి. వారు ఆ పాత్రలుగా మారిపోయారు. బయట చూస్తే మీరు వారిని గుర్తుపట్టలేరు. కంగువ ట్రైలర్‌కు భారీ స్పందన వస్తోంది. మరో కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ ముందు విడుదల చేస్తాం’ అని అన్నారు.