Wednesday, January 15, 2025

మంత్రి జూపల్లి కారుపై రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గాద్వాల్: మంత్రి జూపల్లి కృష్ణారావు కారుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న జూపల్లి కృష్ణారావు కారును సరిత వర్గీయులు అడ్డుకొని రాళ్లతో దాడికి దిగారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దాడి చేశారు. సరిత తిరుపతయ్య ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News