సుల్తాన్‌గంజ్-అగువాని గంగా నదిపై నిర్మాణం
ఇప్పటికే రూ. 1717 కోట్లు వెచ్చించిన సర్కార్
బీహార్ భాగల్పూర్ జిల్లాలో ఘటన
పాట్నా: బీహార్‌లో ఒక వంతెన నిర్మాణం తొమ్మిది సంవత్సరాలుగా సాగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై రూ. 1717 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే రెండు సార్లు కూలిన ఈ వంతెన శనివారం మరొక మారు కూలిపోయింది. నిర్మాణంలో ఉండగానే ఇన్ని సార్లు కూలిన వంతెన నిర్మాణం పూర్తి అయిన తరువాత ఎన్ని రోజులు నిలుస్తుందని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్‌గంజ్–అగువాని గంగా నది రూట్ల ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ వంతెన తొమ్మిది సంవత్సరాలు గడచినా పూర్తి కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు కట్టిన వాటిలో రెండు పిల్లర్లు కూడా కూలిపోవడంపై నిపుణులు మండిపడుతున్నారు.
కాగా, ఖగరియా జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై మాట్లాడుతూ, వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే విమర్శలపై పాట్నా హైకోర్టు స్పందించి, నిర్మాణ పనులపై స్టే ఇచ్చిందని తెలియజేశారు. ఇప్పటికే పూర్తయిన భాగాన్ని కూడా కూల్చివేయాలని కాంట్రాక్టర్‌ను హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా వంతెన కూల్చివేత పనులు చేపట్టారని ఆయన చెప్పారు.
ఖగరియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన కాంట్రాక్ట్‌ను ఎస్పి సింగ్లా సంస్థ దక్కించుకుంది. 2014లో నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం విధించిన గడువును ఎనిమిది సార్లు పొడిగించింది. 2022లో వచ్చిన తుపాను కారణంగా నిర్మాణం దెబ్బ తిన్నది. ఆ తరువాత కూడా వంతెన కూలిపోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యాయి.