Friday, November 22, 2024

కమలాతో ఢీ.. తులసీ సాయం కోరిన ట్రంప్!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ తమ ప్రచారానికి భారతీయత పేరున్న సంతతి నాయకురాలు తులసీ గబ్బర్డ్ సాయం తీసుకోనున్నారు. వచ్చే నెలలో డెమోక్రటిక్ అభ్యర్థిని కమలా హారీస్‌కు రిపబ్లిక్ పార్టీ ఎంచుకున్న ట్రంప్‌నకు మధ్య తొలిసారి అత్యంత కీలకమైన డిబెట్ ఉంది. ఈ డిబేట్‌లో హారిస్‌ను గట్టిగా ఎదుర్కొనే విషయాల గురించి ట్రంప్ తులసీ సాయం తీసుకుంటారు. ప్రచారంలో సహకరించే వారి జాబితాను ట్రంప్ బృందం సిద్ధం చేసుకుంది. ఇందులో తులసీ గబ్బర్డ్ కీలక పాత్ర పోషిస్తారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. తన ప్రత్యర్థితో జరిగే తొలి ముఖాముఖి సంవాదం కావడంతో ధీటుగా సన్నద్ధం కావాలని ట్రంప్ సంకల్పించారు. డిబేట్ ఫలితాన్ని తన విజయావకాశాల మెరుగుకు వినియోగించుకోవాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో ట్రంప్ ఏ విధంగా వ్యూహాత్మకంగా దాడికి దిగాలి? ఏఏ అంశాలపై విమర్శలను సంధించాలి? డెమోక్రాట్లను ఇరకాటంలో పెట్టాలనే విషయంపై ట్రంప్ ఈ మహిళా నేత నుంచి తగు సమాచారం పొందుతారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వార్త వెలువరించింది. సెప్టెంబర్ 10వ తేదీన ట్రంప్ హారిస్ డిబేట్ ఖరారయింది. ఎబిసి న్యూస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కకార్యక్రమం పట్ల అమెరికన్లు ఆసక్తితో ఉన్నారు. గబ్బర్డ్ ఇంతకు ముందు డెమోక్రాటిక్ పార్టీలో ఉన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల దశలో పార్టీ అభ్యర్థిగా స్థానం సంపాదించుకునేందుకు యత్నించి విఫలం చెందారు. దీనితో పార్టీ వీడారు. ఇప్పుడు ఆమె ట్రంప్ మద్దతుదారులలో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. ట్రంప్ ఈ మధ్యదశలో ట్రంప్ అభ్యర్థిత్వం తరువాతి ప్రచార దూకుడుకు అన్ని విధాలుగా సహకరిస్తూ, ఓ దశలో ట్రంప్ సహ పోటీదారు అవుతారని కూడా ప్రచారం జరిగింది.

డెమోక్రాటిక్ పార్టీలో ఉన్నప్పుడు తులసీ తరచూ కమలా హారిస్‌తో కీలక విషయాలలో విభేదించడం, ప్రత్యేకించి ఈ పార్టీలో ఉండే లొసుగుల గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండటంతో ట్రంప్ ఇప్పుడు కమలా హారిస్‌పై బలహీనతల ప్రాతిపదికన విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2019 ప్రైమరీ డిబేట్‌లో తులసీ గబ్బర్డ్ ఏకంగా బహిరంగ వేదికపైనే కమలా హారిస్‌ను తన వాగ్థాటితో చిత్తు చేశారు. గబ్బర్డ్ సహకారం తీసుకోవడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ట్రంప్ తరఫు మహిళా అధికార ప్రతినిధి కరోలిన్ లివిట్ కూడా ఈ పత్రికకు నిర్థారించారు.తమ బాస్ డిబేట్‌లలో దిట్ట అనే విషయం ఇప్పుడే కాదు పలుసార్లు నిర్థారణ అయిందని కూడా ఈ లేడి వెల్లడించింది. ఇంతెందుకు ఇటీవల బైడెన్‌ను తొలి డిబేట్‌లోనే చిత్తుచేయడం ద్వారా పోటీ నుంచి వైదొలిగేలా చేశారని చెప్పారు.

ఎటువంటి చర్చల్లో అయినా, ఎవరితో నైనా అప్పటికప్పుడు డిబేట్‌కు సిద్ధంగా ఉండే సత్తా తమ నేతకు ఉందని, అయితే ఈ క్రమంలోనే ఆయన సంబంధిత విషయాల నిపుణులతో ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటారని, సమాచారం రాబట్టుకుంటారని వెల్లడించారు. వచ్చే నెలలో జరిగే డిబేట్‌కు ట్రంప్ ఫ్లోరిడాలోని మారే లోగోలో ఉన్న తన సొంత ప్రైవేట్ క్లబ్‌లో ట్రంప్ ఇప్పుడు తగు విధంగా శిక్షణ పొందుతున్నారు. ఈ దశలో ఆయనకు తులసీ గబ్బర్డ్ సహకరిస్తున్నారని వెల్లడైంది. ట్రంప్ ఇప్పుడు ఓ మహిళా నేతను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మరో మహిళా నేత నుంచే తగు విధంగా సరైన విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. పైగా ప్రత్యర్థి పార్టీ అంతర్గత విషయాలను కూడా తెలుసుకోవడం ద్వారా తొలి డిబేట్‌లో గెలిచితీరాలని ట్రంప్ ఆశిస్తున్నారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News