కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై మాజీ క్రికెటర్, ఆప్ ఎంపి హర్బ్‌జన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌కు , ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఘాటుగా బహిరంగ లేఖ పంపించారు. దారుణ ఘటన జరిగింది. ఇన్నిరోజులుఅయింది. ఇంతవరకూ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలపై అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు. తాను రాస్తున్న ఈ లేఖ కేవలం పాలకులకే కాదని, భారతీయ పౌరులందరికీ అని తెలిపారు.
ఈ ఘటనలో న్యాయం జరగాల్సి ఉంది, అంతా ఆత్మ పరిశీలన చేసుకుని తీరాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన అందరి మనసులను కలిచివేయడం లేదా? ఈ అక్రూత్యం కేవలం బాధిత మహిళకే కాకుండా దేశంలోని ప్రతి మహిళ గౌరవ మర్యాదలకు భంగకరం, అంతేకాకుండా తలెత్తుతున్న వికృత సామాజిక పరిణామాలకు పరాకాష్ట అని ఈ లేఖలో తెలిపారు.