Thursday, September 19, 2024

రాష్ట్రంలో ఐదు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వెంబడి వ్యాపించిందని వాతావరణ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం, సైబరాబాద్ ఏరియాలో రానున్న 1-2 గంటలు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వర్షాలతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News