Thursday, September 19, 2024

హక్కుల గళం సింఘ్వీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ హక్కుల కోసం సింఘ్వీ పోరాడుతారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ముఖమంత్రి అధ్యక్షతన నానాక్‌రామ్ గూడలోని షెరటాన్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు అభిషేక్ మను సింఘ్వీని సిఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రతిపాదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరా లు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. 2014 పునర్విభజన చట్టా న్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదని, పునర్విభజన చ ట్టంలోని అంశాలను చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలం గా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.

అపరిష్కృతమైన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో, న్యాయస్థానాల్లో అభిషేక్ మను సిం ఘ్వీ గట్టిగా వాదిస్తారని సిఎం రేవంత్ తెలిపారు. ఎంపి కేకే పెద్దమనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్య వహరించారని సిఎం పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉద యం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మ ను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారని, ఆయన వెంట తా మంతా వెళతామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ తెలంగాణ నుంచి పోటీ చేయడం సంతోషాన్నిస్తోందన్నారు. నేడు (సోమవారం) పార్టీ కీలక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన ప్రకటించారు. తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. తెలంగాణ విభజన అంశాలపై రాజ్యసభలో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలోన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీనియర్ నాయకులు కె. కేశవరావు రాజీనామా చేయడంతో సెప్టెంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పోటీ చేస్తున్నారు.

సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని అందరూ ఆమోదించారు: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ తరఫున అందరం సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం. అభిషేక్ మను సింఘ్వీ దేశంలోనే ప్రముఖ న్యాయవాది అని, అలాంటి వ్యక్తి తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News