Wednesday, January 15, 2025

పుష్ప-2కు పోటీగా ‘ఛావా’.. టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. భారీ యాక్షన్ ఎపిసోడ్ తో వదిలిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  అయితే, అదే రోజున పుష్ప2ను విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలో బాలీవుడ్ లో పుష్పకు టఫ్ ఫైట్ ఎదురుకానుంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ రూ.100 కోట్లు కొల్లగొట్టిన బన్నీ.. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా రూ.వెయ్యి కోట్లపై కన్నేశాడు. కానీ, అనూష్యంగా విక్కీ కౌశల్ బరిలోకి దిగడం.. పుష్ప మూవీ కలెక్షన్స్ పై ప్రభావ పడనుంది. ఇదే జరిగితే పుష్ప 2 రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. మరి మేకర్స్ మరోసారి వాయిదా వేస్తారా? లేక పోటీలో ఉంటారా? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News