Thursday, September 19, 2024

కోల్ కతా ట్రెయినీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక …ఏం జరిగిందంటే ?

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఇటీవల 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె శవపరీక్ష(అటాప్సీ) ఆమెకు 14 గాయాలయినట్లు ధ్రువీకరించింది. పైగా హత్యాచారానికి గురయిందని రుజువయింది. గాయలు, గొంతు పిసికి చంపడం వంటివి జరిగాయని రుజువయింది.

ట్రెయినీ డాక్టర్ తల, ముఖం, మెడ, చేతులు, మర్మాంగాల పై ఉన్న గాయాలు ఆమె ఘోరంగా హత్యాచారానికి గురయిందని రుజువుచేస్తున్నాయి. ఆమెను గొంతు పిసకడం వల్ల ఊపిరాడకుండా చనిపోయిందని కూడా తెలుస్తోంది. ఆమె లైంగిక దాడి జరిగిందనడానికి ఆమె శరీరంపై ఉన్న గాయాలే సాక్ష్యం. అంతేకాక ఆమె మర్మాంగంలోకి బలవంతంగా పెనెట్రేషన్ చేసినట్లు కూడా రుజువయింది. బాధితురాలి మర్మాంగంలో తెల్లటి, మందమైన, చిక్కటి ఇంద్రియం లభించింది.

బాధితురాలు ముక్కు, దవడ, ఎడమ చేయి, భుజం పై ఉన్న గాయాల ప్రకారం ఆమె హత్యాచారానికి ముందు చాలా పెనుగులాండిందని, పోరాడిందని తెలుస్తోంది. కానీ అగంతకులు ఆమెను తమ శారీరక బలంతో లోబరుచుకున్నారని తెలుస్తోంది.

మృత దేహాన్ని చూసిన సాక్షులు ఆమె నీలం రంగు బెడ్ షీట్ లో మెడ నుంచి మోకాళ్ల వరకు చుట్టి ఉండడాన్ని, ఆమె కుర్తా తొలగిపోయి ఉండడం, ఆమె ట్రౌజర్లు కనిపించకపోవడం, ఆమె ల్యాప్ టాప్, నోట్ బుక్, సెల్ ఫోన్, ఓ వాటర్ బాటిల్ ఆమె శరీరం ప్రక్కన ఉండడం చూశామన్నారని అభిజ్ఒ వర్గాలు తెలిపాయి. ఆమె చావుకు కారణం గొంతు పిసకడమేనని తేలింది. ఆమె గాఢ నిద్రలో ఉండగా దాడి జరిగిందని కూడా శవ పరీక్ష నివేదిక పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News