పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దౌర్జన్యకాండకు ప్రేరేపించేలా సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్ట్ పెట్టినందుకు బికామ్ రెండవ సంవత్సరం విద్యార్థి కీర్తి శర్మను కోల్‌కతాపోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కీర్తిసోషల్’ పేరిట పోస్ట్‌లు పెడుతుండే విద్యార్థి కీర్తి శర్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య మాదిరిగా ముఖ్యమంత్రి హత్యకు ఇతరులను ప్రోత్సహించాడని పోలీసులు ఆరోపించారు. నిందితుడు ఈ నెల 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో కిరాతకంగా హత్యాచారానికి గురైన 31 ఏళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటో వెల్లడించాడని కూడా పోలీసులు ఆరోపించారు. ఆ ఘటనకు సంబంధించి ఒక ప్రకటనను కోల్‌కతా పోలీసులు విడుదల చేశారు. ‘ఆర్‌జి కర్ ఆసుపత్రిలోని ఇటీవలి సంఘటనకు సంబంధించిన మూడు ఇన్‌స్టాగ్రామ్ కథనాలను అప్‌లోడ్ చేసిన,
‘కీర్తిసోషల్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడి గల నిందితుని విషయమై ఒక ఫిర్యాదు అందింది. ఆ పోస్ట్‌లల్లో హతురాలి చిత్రం, పేరు వెల్లడించారు. అది అత్యంత నేరపూరిత కృత్యం. అంతే కాదు. గౌరవనీయ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిపై నిందాగర్భ వ్యాఖ్యలు, ప్రాణానికి ముప్పులు ఉన్న రెండు కథనాలను నిందితుదు పంచుకున్నాడు. ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి, సమాజాల మధ్య విద్వేషాన్ని ప్రేరేపించేవి, సామాజిక అశాంతి సృష్టించేవి’ అని పోలీసులు వివరించారు. హత్యాచార ఘటనకు సంబంధించిన సామాజిక మాధ్యమ పోస్ట్‌లపై కోల్‌కతాపోలీసులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌పై సిబిఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుఖేందు శేఖర్ బాహాటంగా కోరిన తరువాత ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారు.