- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. కుండపోత వర్షం కురవడంతో రోడ్లపై నాలుగు పీట్ల ఎత్తులో వరద ముంచెత్తడంతో వాహనాలు, మనుషులు కొట్టుకపోయారు. రాంనగర్ లోని ఇంద్రానగర్ లో ద్విచక్రవాహనదారుడు వరదకు ఎదురుగా డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో అతడు వరదలో కొట్టుకొని పోయాడు. అతడిని కాపాడడానికి మరో ఇద్దరు వ్యక్తుల ప్రయత్నించారు. 500 మీటర్లు కొట్టుకొనిపోయిన తరువాత స్థానికులు వారిని కాపాడారు.
- Advertisement -