- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటుగా స్పందించారు. ‘చీప్ మినిస్టర్ రేవంత్, నా మాటలు గుర్తుంచుకో’ అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్ సచివాలయం పరిసరాల్లో నుంచి చెత్తను తొలగిస్తామని తెలిపారు.
నీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం ఆయన నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. మానసిక రుగ్మత నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
- Advertisement -