మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని కమిన్స్ భార్య బెకీ బోస్టన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే కమిన్స్ దంపతులకు అల్జీ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా కమిన్స్ బార్య బోస్టన్ మరోసారి తల్లి కాబోతుంది. ఇక కమిన్స్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బెకీ తాను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది. నేను, కమిన్స్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ పోస్టు పెట్టింది. ఇదిలావుంటే కమిన్స్ కూడా కొంతకాలం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్తో జరిగే టెస్టు సిరీస్లో పాల్గొనే ముందు కమిన్స్ ఎనిమిది వారాల విరామం తీసుకోవాలని నిర్ణయించాడు. ఏడాదిన్నరగా కమిన్స్ ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో తగిన విశ్రాంతి కావాలని కోరగా క్రికెట్ ఆస్ట్రేలియా దీనికి అంగీకరించింది.